మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అదేశల మేరకు,*ప్రజా గోస - బిజెపి బరోసా*కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని శక్తి కేంద్రాలలో కార్నర్ మీటింగ్స్ వేగవంతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ సందర్భంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఎల్బీనగర్ లోని 11వ డివిజన్ సంజయ్ నగర్ లో చిల్క భారతి ఆధ్వర్యంలో *శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు *సోమారపు లావణ్య అరుణ్ కుమార్ కాసిపేట శివాజీ మాట్లాడుతూ ఈ శ్రమ్,ప్రధానమంత్రి జన్ ధన్ యోజన,సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి ఇన్సూరెన్స్ యోజన,ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన,ఉజ్వల యోజన మరియు ఇతర కేంద్ర పథకాల గురించి మరియు రాష్ట్రంలో బి ఆర్ యస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో క్యాతం వెంకటరమణ, రాచకొండ వెంకటేశ్వర్లు ,కార్పొరేషన్ అధ్యక్షులు లక్ష్మణ్,LB నగర్ మండలం జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ బిజెపి మండల,గ్రామ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: