ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో  30 వ డివిజన్ బాలసముద్రం లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్  గుండు సుధారాణి తో కలసి  కే.సి.ఆర్ పట్టణ ప్రకృతి వనం" ను ఏర్పాటు చేసి పెద్దయెత్తున మొక్కలను  నాటారు.

  ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ 

 ఉద్యమ నేత, జనహృదయ నేత సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశ, రాష్ట్రవ్యాప్తంగా, కొన్ని దేశాలలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారని , పూజలు సేవా కార్యక్రమాలు అభిషేకాలు మొక్కలు నాటి, టోర్నమెంట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్ పాలన లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని,  కేసీఆర్ ప్రధాని అయ్యి తెలంగాణ వలే  అభివృద్ధి జరగాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని అన్నారు. ప్రజల అభిమానం ఆశిస్సులతో సీఎం కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన  శుభాకాంక్షలు తెలిపారు. వారి పుట్టినరోజు సందర్భంగా

చారిత్రాత్మక వరంగల్ నగరంలో  ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు, హరితహారం చేపట్టడం జరుగుతున్నదని  అన్నారు.  నేడు విరివిగా మొక్కలు నాటి నామకరణం చేసిన కే.సి.ఆర్ పట్టణ ప్రకృతి వనం" ను స్థానిక ప్రజల భాగస్వామ్యం తో వివిధ రకాల  మొక్కలు నాటి పరిరక్షిస్తామన్నారు.

60 ఏళ్ల తెలంగాణ కలను నిజం చేసిన అధినేత కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున మసీదులలో దేవాలయాల్లో పూజలు చేయడం జరిగిందని చీఫ్ విప్ అన్నారు.

నగర మేయర్  గుండు సుధారాణి మాట్లాడుతూ కెసిఆర్ మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు సందర్భంగా కెసిఆర్ పట్టణ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు  గత సంవత్సరం కూడా కెసిఆర్ పార్క్ ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతున్నదన్నారు.  

తెలంగాణ తరహా అభివృద్ధి దేశంలో జరగాలని లక్ష్యంతో సీఎం కేసీఆర్ బయలుదేరారని, అనుకున్నది సాధించేదాకా పోరాడే నాయకుడు కేసీఆర్ అని మేయర్ కొనియాడారు.

ముఖ్యమంత్రి భద్రకాళి అమ్మవారి, యాదాద్రి నరసింహ స్వామి, తిరుపతి వెంకన్న ఆశీస్సులతో నిండు నూరేళ్లు  ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కృషి చేసిన మహా నాయకుడు కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. పేద ప్రజలను రైతులను కార్మికులను ఆదుకోవాలంటే కెసిఆర్ లాంటి నేత రాష్ట్రానికే కాదు భారతదేశానికి  అవసరమన్నారు. రాబోయే రోజుల్లో దేశం మొత్తం సేవ చేసే విధంగా అందరు దేవతల దీవెనలు కేసీఆర్ కు ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు విమోచన అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు,  అడిషనల్ కమిషనర్ రవీందర్ యాదవ్ యాదవ్ ఉప కమిషనర్లు అనిసుర్ రషీద్ జోన సి హెచ్ ఓ శ్రీనివాస్ రావు ఎస్ ఈ లు ప్రవీణ్ చంద్ర,కృష్ణారావు, సిటీ ప్లానర్ వెంకన్న, సీఎం హెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్,  బల్దియా విభాగాల అధికారులు, టి.ఎం.సి.రమేష్,సి.ఓ.లు, టి. ఎల్ ఎఫ్ లు, ఓ బి లు, ఆర్పీ లు ,ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: