మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణిలో ఉత్పత్తి-ఉత్పాదకత-రక్షణ-మరియు అధికారులకు కార్మికులకు మధ్య వారధిగా పనిచేస్తూ నిత్యం పనిలో గనిలో సమస్యల సుడిగుండంలో నలిగిపోతు. మైనింగ్ సిబ్బంది తమ ప్రాణప్రదమైన మైనింగ్ సర్టిఫికెట్ పణంగా పెట్టి అధికారుల ఆదేశాల ప్రకారం సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ సోదరులు విధులు నిర్వహిస్తూన్నారు.
సింగరేణి యాజమాన్యం మరియు ఉన్నత అధికారులు మైనింగ్ స్టాప్ వారి సేవలను వాడుకుంటూ ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిన ఆ ప్రమాదాలకు కేవలం మైనింగ్ సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేస్తూ క్రమశిక్షణా చర్యల పేరుతో ఛార్జిషీట్లు, సస్పెండ్లు,ఇంక్రిమెంట్ల నిలుపుదల, డి ప్రమోషన్స్ చివరకు ఉద్యోగాలనుండి కూడా తొలగింపుకు
యాజమాన్యం పూనుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.
సింగరణీలో మైనింగ్ స్టాప్ సిబ్బంది రోజు డ్యూటీలో 8 గం లకు మించి పని చేస్తూ తన రిలీవర్స్ కు సేఫ్టీ పై సూచనలు
ఇస్తూ తమ శ్రమను, ఎలాంటి అదనపు ఆర్థిక చెల్లింపులకు ఆశించకుండా అధికారులకు యాజమాన్యానికి మైనింగ్
స్టాప్ సేవలందిస్తున్న సంగతి గుర్తించకుండా నేడు జరుగుతున్న ప్రతి ప్రమాదాల్లో మైనింగ్ స్టాప్ ను బాధ్యత
చేస్తూ ఉద్యోగాల్లోనుండి తలగింపు వంటి దుర్మార్గమైన పాశవిక చర్యలకు పూనుకోవడం అత్యంత బాధాకరం
భూపాలపల్లి ocp3 అండర్ గ్రౌండ్ ప్రాజెక్టు లో దురదృష్టవశాత్తు జరిగిన మిస్సైరింగ్ ప్రమాదానికి ముగ్గురు మైనింగ్ స్టాప్ సూపర్ వైజర్లను బాధ్యులుగా చేస్తూ ఆర్థికంగా నష్టం చేయడమే కాకుండా వారి ఆర్థిక హోదాను తగ్గించడం, ఇంటిమెంట్ల కోత విధించారు. షాట్ పైరర్ గా పనిచేస్తున్న ప్రకాష్ ఏకంగా ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారు.
సింగరేణిలో ఇప్పటి ఇంత తీవ్రమైన కటిన చర్య ఏనాడు విధించలేదు. సింగరేణి సంస్థలో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికిని సింగరేణియాజమాన్యం ప్రమాదాలకు బాధ్యులుగా నిర్ధారించిన అధికారులు, సూపర్వైజర్లపై
సింగరేణి అధికారుల ఆదేశాలతో మాత్రమే పని చేస్తున్న బాధ్యత గల మైనింగ్ స్టాప్ సూపర్ వైజర్స్ ను మాత్రమే ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యులను చేస్తూ అధికారులు-యాజమాన్యం తప్పించుకొని నెపం మాత్రం అధికారులు నిబంధనలు అతిక్రమించారని, విదుల్లో నిర్లక్ష్యం వహించారని, సీఎంఆర్ ను నిర్లక్యం చేశారని ఆరోపించడం తగదు. వాస్తవ . పరిస్థితులను అర్ధం చేసుకొని మైనింగ్ సిబ్బందిపై విదించిన తీవ్రమైన క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకోవాలని IFTU డిమాండ్ చేస్తున్నది. 'సింగరేణి లో మైనింగ్ సూపర్ వైజర్స్ కు అధికారుల యాజమాన్యం మద్య సుహృద్భావమైన వాతావరణం నెలకొనే
విధంగా ప్రయత్నించాలి.
కాని ఏకపక్షంగా క్రమశిక్షణ చర్యల పేరుతో కార్మికుల్లో, మరియు కార్మిక కుటుంబాల్లో పారిశ్రామిక అశాంతి నెలకొనే పరిస్థితి యాజమాన్యం తీసుకరావడం సింగరేణి సంస్థకు మంచిది కాదని IFTU హెచ్చరిస్తుంది. సింగరేణి లో నిబంధనల ప్రకారం నడుచుకుంటూ గని రూల్స్, మైనింగ్ చట్టాన్ని అమలు పరచడానికి మైనింగ్ సోదరులు నిత్యం విధుల్లో అనేక చివాట్ల, తిరస్కారాల మద్య కార్మికుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం చేస్తున్న సేవలు శక్తివందనకు మించి కృషి చేస్తున్న మింగ్ స్టాప్ సోదరుల సేవల సంగతి అధికారులకు యాజమాన్యాన్ని తెల్పింది." సింగరేణిలో ప్రమాదాలు జరిగితే మాత్రం రివార్డ్స్ క్రింది స్థాయి ఉద్యోగులకు సింగరేణిలో ఉత్పత్తి పెరిగిన లాభాలు వచ్చిన సంస్థ టార్గెట్స్ మించి ఉత్పత్తి చేస్తే అవార్డులు మాత్రం అధికారులకు ఇది పూర్తిగా అన్యాయం, వెంటనే మైనింగ్ సిబ్బందిపై విధించిన క్రమశిక్షణా చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని IFTU డిమాండ్ చేస్తుంది.
సాదుల ప్రకాష్ షాట్ ఫైర్ డిస్మిస్ ను రద్దు చేసి ఉద్యోగంలోనికి తీసుకోవాలి. శ్రీకాంత్ OM B నుండి డిప్రమోట్ ను ఉపసంహరించుకోవాలి.
బత్తుల వెంకటేశ్వర్లు, మైనింగ్ సర్దార్ A నుండి 8 గ్రేడ్ గా డీ ప్రమోట్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని IFTU డిమాండ్ చేస్తున్నది.

Post A Comment: