చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పురపాలక పరిధిలోని 11వ వార్డులో 20 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం 11వ వార్డులో ఓపెన్ డ్రైనేజీ పనులను స్థానిక కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ 20 లక్షల రూపాయలతో వార్డులో సిసి రోడ్లు, మురుగు
కాలువల నిర్మాణానికి వెచ్చించడం జరుగుతుందని తెలియజేశారు. వార్డును అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని. ఒక ప్రణాళిక
ప్రకారం వార్డు అభివృద్ధికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.


Post A Comment: