మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టిపిసి తెలంగాణ ప్లాంట్ లో టాటా కంపెనీకి అనుబంధంగా ప్యారాగ్రీన్ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీ లో విధులు నిర్వహిస్తున్న సుమారు 60 మంది సెక్యూరిటీ గార్డ్స్ వారికి రావలసిన పెండింగ్ జీతాల విషయంలో పలుమార్లు కంపెనీకి మొరపెట్టుకున్న వినకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ గారి దృష్టికి తీసుకుపోగ సంబంధిత అధికారులతో మాట్లాడినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో నిన్నటి నుండి ప్రైవేట్ సెక్యూరిటీ గార్లు సమ్మెకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్యారగ్రీన్ కంపెనీ అధికారులు పెండ్యాల మహేష్ తో ఫోన్లో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న జీతాలు ఈనెల 12వ తారీకు లోపు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను ఎత్తివేస్తున్నట్టు తెలియజేశారు అనంతరం పెండ్యాల మహేష్ మాట్లాడుతూ సంస్థను కాపాడడం కోసం సమస్త ఆస్తులను కాపాడడం కోసం సెక్యూరిటీ గార్డ్స్ రాత్రి అనకా పగలనకా వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి శ్రమను దోచుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 12వ తారీకు లోపు జీతాలు చెల్లించని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని సంబంధిత కంపెనీకి తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు ప్యరగ్రీన్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్స సూపర్వైజర్ ఐలయ్య సెక్యూరిటీ గార్డ్స్ తమ్మన వేణి శ్రీనివాస్ యాదవ్ రాజశేఖర్ జయ సాయి కిరణ్ వెంకటేష్ రవి చంద్ హరికృష్ణ తమ్మనవెని మహేష్ యాదవ్ యూత్ నాయకులు కాజీపల్లి శ్రీనివాస్ ఉరేటి మహేష్ పెండ్యాల వెంకటేష్ తడితరులు పాల్గొన్నారు

Post A Comment: