మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఓసిపి-5 ప్రాజెక్టు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన ధర్నా కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై,
కార్యక్రమం సంధర్భంగా మాట్లాడుతూ ఓసిపి-5 ప్రాజెక్టు విస్తరణను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు చేసిన విషయం రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ విదితమే..
సింగరేణి యాజమాన్యం ఆద్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఓసిపి-5 ను వ్యతిరేకిస్తూ ప్రజగొంతుకలై ప్రజలపక్షాన తమ గోడును వినిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది,
కాని ఇక్కడి శాసనసభ్యులు గారు ఎన్నికల వేళ ఓసిపి-5 ను రానివ్వకుండా అడ్డుకుంటామని ప్రగల్భాలు పలికి, తీరా గెలిచాక సింగరేణి యాజమాన్యంతో లోపాయికారీ ఒప్పందాల వల్లనే
గోదావరిఖని బొందలగడ్డగా మారడానికి పూర్తి సహాయసహకారాలు అందించారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని,
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఓసిపి-5 ప్రాజెక్టు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును మూసివేయాలని, దానికి శాసనసభ్యులు పూర్తి మద్దతు తెలిపాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరిన్ని ప్రత్యక్ష పోరాటాలతో పాటు, ప్రాజెక్టు మూసివేతకు గౌరవ హైకోర్టును & నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించి నియోజకవర్గ ప్రజల రక్షణ కొరకై కృషి చేస్తామని అన్నారు..ధర్నా అనంతరం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు & కాంగ్రెస్ శ్రేణులు ఓసిపి-5 ప్రాజెక్టు వైపు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టులు చేసి, పోలీస్ స్టేషనుకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొేరేటర్లు,డివిజన్ అధ్యక్షులు, ఎస్.సీ, బీసీ, మైనారిటీ, మహిళా, యువజన విభాగం, NSUI విభాగాల అద్యక్షులు, ఎన్టీపీసీ, రామగుండం టౌన్ అద్యక్షులు, నాయకులతో పాటు కార్యకర్తలు,& అధిక సంఖ్యలో వివిధ డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: