మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

5ఇంక్లైన్ ఓసీపీ బ్లాస్టింగ్ల నుండి ప్రజల ప్రాణాలు, కాపాడాలని ఈ రోజు రామగుండం కార్పొరేషన్ కాంగ్రేస్ పార్టీ  ఆధ్వర్యంలో ఖనీ మెయిన్ చౌరస్తాలో  ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది.. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు *రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్  మాట్లాడుతూ5ఇంక్లైన్ ocp  వల్ల ప్రతి రోజు భూకంపాన్ని తలపించే పేలుళ్లతో ఇళ్లకు బీటలు వారుతూ ఇంటిలోని సామానులు చెల్లాచెదురవుతూ, దుమ్ము దూళి తో నిత్యం జనా వాసాలను అస్తవ్యస్తం చేస్తున్న  ocp 5 ప్రాజెక్టును వెంటనే నిలిపివేసి ప్రజల ప్రాణాలను, ఆస్తులను మరియు ఈ ప్రాంతాన్ని కాలుష్యం నుండి కాపాడాలని కోరారు, ఈ ప్రాంతం బొందల గడ్డగా మారుతున్న ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడని, మరియు తెరాస నాయకులు వారి స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని. బ్లాస్టింగ్ ల వల్ల ప్రజల ప్రాణాలు,ఆస్తులు నష్టమైన అనువంతైన చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ బ్లాస్టింగ్లను ఆపకపోతే తన ప్రాణాలను ఫణంగా  పెట్టైనా సరే  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఉదృతం చేస్తానని ధ్వజమెత్తారు. అనంతరం చౌరస్తా నుండి 5ఇంక్లైన్ ప్రాజెక్టు పాదయాత్రగా బయలుదేరిన *రాజ్ ఠాకూర్ ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,మరియు అనునిత్యం ఓసీపీ బ్లాస్టింగ్ ల ఇబ్బంది పడే బాధిత ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: