మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని కాళేశ్వరం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నూతన వైద్యాధికారిణిగా డాక్టర్ టి సుస్మిత ఈరోజు బాధ్యతలు స్వీకరించి విధులలో చేరినారు.వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానం పలికినారు.విధులలో చేరిన అనంతరం డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించగలనని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి ఏ స్వామి,స్టాఫ్ నర్స్ బి కీర్తి,హెల్త్ అసిస్టెంట్ ఏ రాజా రమణయ్య,ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: