ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ;

వరంగల్, హనుమకొండ నూతన జిల్లాలుగా ఏర్పడినందున ఎం‌జి‌ఎం ఆవరణలో గల హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణ సంస్థ కార్యాలయం ను ప్రజల సౌకర్యార్థం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని డి‌ఆర్‌టి 10 క్వార్టర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి టి‌బి భవనమును జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.బి. సాంబశివ రావు, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ఎం‌జి‌ఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్ర శేఖర్ గారు, తెలంగాణ రాష్ర్ట టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్  మరియు ఎస్పీఎం  ప్రొఫెసర్  డాక్టర్ నిర్మలతో కలసి ప్రారంభించారు. ఇట్టి సమావేశంలో ఎం‌జి‌ఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్  మాట్లాడుతూ భారత ప్రభుత్వం నిర్ధేశించిన టి‌బి వ్యాధి ఎలిమినేషన్ కార్యక్రమం 2025 వరకు సాధించుటలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది డాక్టర్ లు మరియు ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతలను నిర్వర్తించి క్షయ వ్యాధి ఎలిమినేషన్లో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.బి. సాంబశివ రావు  మరియు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్  మాట్లాడుతూ క్షత్ర స్థాయి లో టి‌బి వ్యాధి పట్ల అవగాహన కలిగించాలని ప్రజలు వ్యాధి నిర్ధారణ, మరియు చికిత్చ తీసుకోవడానికి ముందుకు రావాలన్నారు. 

జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ పిఎస్సెస్  మల్లిఖార్జున్ మాట్లాడుతూ త్వరలో ఈ భవనములో పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ సేవలు ప్రారంభించడం జరుగుతుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్  మరియు ఎస్పీఎం  ప్రొఫెసర్  డాక్టర్ నిర్మల,జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ పిఎస్సెస్  మల్లిఖార్జున్, డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.ఎం‌డి. యాకుబ్ పాషా, వరంగల్ క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సుధర్ సింగ్, కరీంనగర్ క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, నల్గొండ క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డబ్య్లు హెచ్ ఓ  కన్సల్టెంట్ లు డాక్టర్ స్నేహ శుక్ల, డాక్టర్ మహేశ్, డాక్టర్ ఊష్మా, జిల్లా ప్రోగ్రాం  అధికారులు డాక్టర్ గీత లక్ష్మి, డాక్టర్. ఉమాశ్రీ, డాక్టర్ వాణిశ్రీ,  టెక్నికల్ అధికారి వాసు ప్రసాద్ , స్టేట్ ఐ‌ఈసి్ అధికారి జితేంద్ర, డెమో వి. అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో ప్రసాద్, టి‌బి సూపర్ వైసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు టి‌బి అలర్ట్ ఇండియా ప్రతి నిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: