ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించి పోలీసుల శాఖ గౌరవం పెంచే విధంగా, పోలీసు అధికారులు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది ఫిర్యాదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి ఓపికగా వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా ఎస్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, స్నేహభావంగా మసులుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసేది కేవలం మంచి వారికేనని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారికి కాదని ఎస్పి పేర్కొన్నారు.

Post A Comment: