ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జనగామ జిల్లా కేంద్రంలో గ్రంధాలయ వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీపీ, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పుస్తకాలు చదివే తెలంగాణ ఉద్యమం చేశారు. అహింస మార్గంలో తెలంగాణ సాధించారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుంది.
యువత ఈ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి.
ప్రతి మండల కేంద్రంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం
జనగామ జిల్లా కేంద్రంలో కొత్తగా మంచి గ్రంథాలయం కట్టడానికి నిధులు మంజూరు చేయిస్తా. అందరూ కలిసికట్టుగా మన గ్రంథాలయాలను కాపాడుకుందాం.
ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుం చి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు.
కరోనా వలన రెండేండ్లుగా వారోత్సవాలు నిర్వహించలేదు.
కరోనా తగ్గడంతో ఈసారి నుంచి నిర్వహిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల పుస్తకాలు అందించాలనే లక్ష్యంతోనే 1919లో అఖిల భారత ప్రజా గ్రంథాలయ అసోసియేషన్‌ను స్థాపించడం జరిగింది.
కాలక్రమేణా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌గా మారింది.
1968 నవంబర్ 14నుంచి ప్రతిఏటా గ్రంథాలయ వారోత్సాలను నిర్వహిస్తోంది.
విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు. గ్రంథాలయాలను దేవాలయాల కంటే పవిత్రంగా చూస్తారు.గ్రంథాలయాలను సరస్వతి నిలయాలుగా పిలుస్తారు.
మన సీఎం కెసిఆర్ కు కూడా గ్రంథాలు చదవడం ఎంతో ఇష్టం. పుస్తకాలు చదవడం వల్లే కెసిఆర్ ఎంతో తెలివిని సంపాదించారు.
గ్రంథాలయాల అభివృద్ధికి పాటు పడుతున్నారు.
కొత్త భవనాలను ఏర్పాటు చేసి, గ్రంథాలయాలను కమిటీలు వేశారు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా పుస్తక పఠనంపై యువత మొగ్గు చూపుతున్నారు.
ఇంటర్నేట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైనా నెట్‌లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతున్నది.
కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి నెట్ సెర్చింగ్‌లో లేదు.
సాంకేతిక ఎంత పెరిగినా ఎన్ని కంప్యూటర్లు వచ్చినా గ్రంథాలయ ప్రత్యేకత కాదనలేదనిది.
చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం
పుస్త కం జీవితాన్ని మారుస్త్తున్నది.
గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలుగా కూడా పిలుస్తుంటారు. విద్యార్థులు గ్రంథాలను చదివి గొప్ప వాళ్ళుగా ఎదగాలన్నారు.


Post A Comment: