ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో గ్రంథాలయాలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చేతి వేళ్ళపై ప్రపంచాన్ని చూపించే నేటి సాంకేతిక యుగాన్ని సృష్టించడంలో పుస్తకాలే ముఖ్య పాత్ర పోషించాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పిల్లల తల్లిదండ్రులకు ఒక అప్పిల్ చేశారు. భావితరాలకు భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని చేతికందించడంతో పాటు పుస్తకాలను సైతం అందించాలని కోరారు. ఈ వారోత్సవాల సందర్భంగా పుస్తక పఠనం పట్ల రెట్టింపు ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అజిజ్ ఖాన్, నగర మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ కార్యదర్శి పద్మజ, గ్రంథాలయ డైరెక్టర్ మధు, కార్పొరేటర్లు ఏనుగుల మానస రాంప్రసాద్, బోయినపల్లి రంజిత్ రావు, పాఠశాల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: