మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: పవిత్ర త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా స్వామివార్లను దర్శించుకొనుటకు సుమారు 50 వేల పైచిలుకు భక్తులు వాహనాలలో వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా నదిలో దీపాలు వెలిగించి వదిలారు.తర్వాత స్వామివారి దర్శనమునకు వెళ్లడానికి ప్రధాన ఘాట్ రోడ్డుపై వేల సంఖ్యలో వాహనాలు నిలపడము, వచ్చి వెళ్లే వాహనాల రద్దీతో పాద భక్తులు నానా ఇబ్బందులు పడి విసుగు చెందారు.వాహనాలను అదుపు చేయడంలో గ్రామపంచాయతీ, దేవాలయం,సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదని వాపోయారు.ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిన క్షేత్రంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో గ్రామపంచాయతీ,ఆలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఏంటని మండిపడ్డారు,ఆలయంలో అర్చకుల కొరతతో పూజ భక్తులు ఇబ్బందులకు గురయ్యారు,పులిహోర, లడ్డు ప్రసాదాలు కూడా కొంతమంది భక్తులకు అందకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు,నది ప్రాంగణం చెత్తాచెదారం, డ్రైనేజీ నీరు పవిత్ర నదిలో కలుషితం కావడంతో చెడు దుర్వాసన వస్తున్న అటు దేవాలయం వారు కానీ, పంచాయతీ వారు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు.భక్తులకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈరోజు ఆలయ ఆదాయం మాత్రం 5,10,000/(ఐదు లక్షల పదివేలు).ఇకనైనా భక్తుల ఇబ్బందులు గ్రహించి సంబంధిత అధికారులు తక్షణం సబ్ స్టేషన్ నుండి నది తీరం వరకు గల ప్రధాన ఘాట్ రోడ్ వెడల్పు కార్యక్రమం చేపట్టాలని,నది తీర ప్రాంగణంలో చెత్త చెదారం తొలగించి అపరిశుభ్రత లేకుండా చూడాలని,డ్రైనేజీల మురుగునీరు నదిలో కలుషితం కాకుండా మార్గాలు ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని పలువురు స్థానికులు,భక్తులు కోరుతున్నారు.


Post A Comment: