ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేర రహిత సమాజంలో సీసీ కెమెరాలు కీలకమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఘనపురం మండలం చెల్పూర్ లో సుమారు 13 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి ఎస్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే తెలుసుకోవచ్చని ఎస్పి అన్నారు. సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని, నేరాలను అదుపు చేయడం, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని కేసులు చేధించ వచ్చని ఎస్పీ పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పి వెల్లడించారు. ఆ తర్వాత సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన ఘనపురం ఎస్సై అభినవ్, సీఐ పులి వెంకట్ ను , సహకరించిన ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రజలను ఎస్పీ అభినందించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ చేల్పూర్ గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకుని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి తమ గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాల అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అంతకుముందు చెల్ఫూర్ సెంటర్ లో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఎస్పి సురేందర్ రెడ్డి , ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు ప్రజలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులతో కలిసి జాతీయ గీతాలాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల సిఐ పులి వెంకట్, గణపురం ఎస్ఐ మ్యాక అభినవ్, చేల్పూరు సర్పంచ్ మధుసూదన్ రావు ,గణపురం ఎంపీపీ, కావటి రజిత ఎంపీటీసీలు, పాల్గొన్నారు..

Post A Comment: