ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ ఎ. చెంగప్ప ఆకస్మిక మృతిపట్ల రాష్ట్ర పంచాయతి రాజ్ గ్రామీణభివృద్ధి , గ్రామీణ సరఫరా శాఖ మంత్రి. ఎర్రబెల్లి దయాకర్ రావు, రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. పి ఆచార్య వేర్వేరు గా సంతాపం తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ గా 1987 - 1990 మధ్య పని చేసిన చెంగప్ప జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసారని మంత్రి తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన చెంగప్ప హన్మకొండలోని జవర్ లాల్ నెహ్రు స్టేడియం ప్రారంభానికి కృషి చేసారని మంత్రి చెప్పారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆవుల చెంగప్ప ఉమ్మడి వరంగల్ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించార ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు.
సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు ఆయన చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు జేసీ సంధ్యా రాణి తహసీల్దార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి ఆత్మ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ 1986 నుండి19 89 వరకు గా విధులు నిర్వహించిన ఆయన జిల్లా అభివృద్ధి కి ఎంత గానో తోడ్పాటు అందించారని అన్నారు. జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని, ప్రజల సమస్య ల పై తక్షణమే స్పందించి పరిష్కరించే వారని అన్నారు.
ఈ కార్యక్రమం లో అదనపు జేసీ సంధ్యా రాణి, డిఆర్ఓ వాసు చంద్ర అధికారులు పాల్గొన్నారు..

Post A Comment: