మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరం. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని పరమేశ్వరునికి ప్రీతివంతమైన సోమవారం రోజున స్వామివార్ల దర్శనమునకు వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్థానిక వ్యాపారి అయినా భక్తుడు గంధసిరి మధుసూదన్ భక్తి భావాలతో,భక్తులకు 30 లీటర్ల పాలు పంపిణీ చేశారు.భక్తులు స్వీకరించి ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.కార్తీక మాసం సందర్భంగా కాళేశ్వరాలయానికి వచ్చే దర్శన భక్తులకు,భక్తి భావాలతో దాతలు ఇలాగే ముందుకొచ్చి పండ్లు పాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పలువురు భక్తులు కోరారు...


Post A Comment: