పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న



                                           పెద్దపల్లి:రామగుండం:నవంబర్:15:దేశానికే మణిహారంగా తెలంగాణలో ప్రభుత్వ  వైద్య విద్యను,వైద్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని,రాష్ట్ర వైద్య విద్యలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నూతన అధ్యాయానికి నాంది పలికామని సీఎం కేసీఆర్ అన్నారు.మంగళవారం  హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు రామగుండం,మంచిర్యాల,మహబూబాబాద్, కొత్తగూడెం,సంగారెడ్డి,నాగర్ కర్నూల్,వనపర్తి,జగిత్యాలలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలలో విద్యా బోధనా తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,సీఎస్ సోమేష్ కుమార్,వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి,ఇతర ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ రామగుండం వైద్య కళాశాల నుండి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు,57 సంవత్సరాల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ప్రారంభమయ్యాయని,గత 8 సంవత్సరాలలో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట,నల్గొండ,సూర్యాపేట,మహబూబ్ నగర్ జిల్లాలలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామని,భద్రాద్రి కొత్తగూడెం,నాగర్ కర్నూల్,వనపర్తి,మంచిర్యాల,జగిత్యాల,సంగారెడ్డి,రామగుండం,మహబూబాబాద్ జిల్లాలో వైద్య కళాశాలలో విద్య బోధన నేడు ప్రారంభించడం సంతోషకరమని,దీని కోసం కృషి చేసిన అధికారులకు,ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా నేటి ప్రారంభోత్సవాన్ని సీఎం కేసీఆర్ అభివర్ణించారు.ఉద్యమ నాయకులు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరిష్ రావు నిరంతర పర్యవేక్షణ ఫలితంగా దీనిని సాధించామని సీఎం కేసీఆర్ అన్నారు.8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవానికి కృషిచేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు,రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు ఏర్పాటుతో ఇతర దేశాలకు వెళ్లి అభ్యసించవలసిన దుస్థితి తప్పిందని,తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవసరం లేకుండా స్వరాష్ట్రంలోనే వారి స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎంబిబిఎస్,పీజీ,సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని,ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడే నాటికి 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రస్తుతం 2790 సీట్లకు,515 ఉన్న పీజీ సీట్లు 1180 కు,70 సూపర్ స్పెషాలిటీ సీట్లు ప్రస్తుతం 152 కు పెరిగాయని సీఎం తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తాయని,గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం రాణిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని,వారికి మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని సీఎం ఆశాభవం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ప్రస్తుత సంవత్సరం మరో 8 వైద్య కళాశాలలు,వచ్చే సంవత్సరం 9 కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం తెలిపారు.ప్రభుత్వ వైద్య కళాశాల అంశంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పథకాల మాదిరిగా ప్రతి  ప్రాంతానికి ఫలాలు అందే విధంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం అన్నారు.వైద్యరంగం పటిష్ట పరిచేందుకు వైద్యులతో పాటు సమాంతరంగా నర్సులు,లాబ్ టెక్నీషియన్స్,మెడికల్స్ సిబ్బంది సైతం కీలకమని సీఎం పేర్కొన్నారు.జిల్లాలో వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని,ప్రతి జిల్లాకు ఒక్కో పారామెడికల్ కోర్సు అందే విధంగా ప్రణాళిక రూపొందించి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని ఆదేశించారు.ములుగు,జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాలలో ఒక అసెంబ్లీ నియోజవర్గం మాత్రమే ఉన్నప్పటికీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జిల్లా ఏర్పాటు చేశామని త్వరలో మెడికల్ కళాశాల సైతం మంజూరు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లో అగ్రదేశాలైన అమెరికా యూరోపాలలో సైతం లక్షల మంది మరణించారని,భవిష్యత్తులో ఇలాంటి అనేక వైరస్ లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారని,వైద్య సదుపాయాలు మెరుగుపరచుకోవడం చాలా కీలకమని వైద్య వ్యవస్థ పటిష్టంగా ఉన్న రాష్ట్రాలు తక్కువ నష్టంతో బయటపడతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని అన్నారని,ఆ దిశగా దేశ వైద్య రంగానికే మణిహారంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధి చేస్తున్నామని,వేల కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.విద్యార్థులు సామాజిక భద్రత,పేదలకు,తెలంగాణ ప్రాంత ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఉద్దేశంతో మెడికల్ విద్యనభ్యసించి విజయం సాధించాలని,కళాశాలలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచించారు.నూతనంగా ప్రారంభించిన వైద్య కళాశాలలను వైద్యశాఖ మంత్రి ఉన్నత అధికారులు,జిల్లాస్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు చిన్న,చిన్న సమస్యలు పరిష్కరించాలని,అర్అండ్ బి శాఖ మంత్రి వైద్య కళాశాలలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు సత్వరం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు,రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మాట్లాడారు,8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించడం చాలా సంతోషకరమని,జిల్లాలోని రామగుండం ప్రాంతానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు కలెక్టర్ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల మంజూరు చేసినప్పుడు అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో విద్యార్థుల కోసం సకాలంలో అందించేలా కృషిచేసిన ఇంజనీరింగ్ అధికారులు,ప్రజాప్రతినిధులను కలెక్టర్ అభినందించారు.రామగుండం మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని,మొదటి దఫాలో 96 సీట్లు విద్యార్థులకు కేటాయించామని,విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన సింగరేణి సంస్థకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.రామగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారని,మంచి అనుభవం కలిగిన అధ్యాపకులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నారని,సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి డాక్టర్లుగా తయారు కావాలని,ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  కుమార్ దీపక్,రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్,ప్రజాప్రతినిధులు,రామగుండం ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమ బిందు,జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్,జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్,సంబంధించిన అధికారులు,తదితరులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: