ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి/సుంక శ్రీధర్
జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెఎఫ్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు పిలుపునిచ్చారు. సోమవారం రోజున పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు మాట్లాడుతూ టిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చేపట్టే ఉద్యమాలకు జర్నలిస్టులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈనెల 29,30 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు జిల్లా నుండి అందించే ఆర్థిక సహకారం,జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ, మండల కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ నెల 10న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై చేపట్టిన డిమాండ్స్ డే ను విజయవంతం చేసిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల బిక్షపతి,ఫణి సుదర్శన్,జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్ వినోద్,మారం తిరుపతిరెడ్డి,జాయింట్ సెక్రెటరీ సాబీర్ పాషా,కార్యవర్గ సభ్యులు బందెల రాజశేఖర్ లతో పాటు పలువురు

Post A Comment: