ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజలు నకిలీ లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర లోన్ యాప్ లు డౌన్ లోడ్ చేసుకొని, ఇబ్బoదులు పడొద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన 18 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు ఓపిగ్గా విన్నారు. ప్రజల/ బాధితుల చట్టపరమైన సమస్యలను సాధ్యమయినంత త్వరగా పోలీసు అధికారులు పరిష్కరించాలని, పరిష్కారం కానీ ఫిర్యాదుల పురోగతి పై తన కార్యాలయానికి నివేదిక అందించాలని ఎస్పి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

Post A Comment: