ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 




హన్మకొండ ;

విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శిరోనాల్డ్‌ రోస్‌  సూచించారు.  విద్యార్థి దశలో కష్టపడితె జీవితాంతం సుఖపడవచ్చని, తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందన్నారు.

సోమవారం  ఆయన హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐటిడిఎ పిఓ అంకిత్, కమిషనర్ ప్రవీణ్యా తో కలసి మడికొండ లో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్సియల్‌ పాఠశాల,  వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ  సందర్బంగా సెక్రటరీ అన్ని విభాగాలను పరిశీలించారు.  తరగతి గదులను  సందర్శించి విద్యార్థుల తో ముచ్చట్టించారు. కిచెన్‌, డార్మెటరీ, స్టోర్‌రూమ్‌, లైబ్రరీ వద్ద ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు. స్టోర్ రూమ్ లో ఉన్న మిగిలిన మెటీరియల్ ను సత్వారమే విద్యార్థులు అందిచలని ఆదేశించారు. విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల తో కలసి  భోజనం చేసారు.వారి ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.   

స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూ చించారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాస్టల్‌ పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.  ఆహార  పదార్థాలను వెస్ట్ చేయరాదు  అని అన్నారు. హాస్టల్ కు వచ్చిన వస్తువులు ను  సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. చిన్న చిన్న రిపేర్ లను  తక్షణమే చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్సిఓ  విద్యా రాణీ, ప్రినిస్పాల్ ఉమా మహేశ్వరి, తదితరులున్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: