మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న 'డిమాండ్స్ డే' కార్యక్రమంలో భాగంగా  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో   జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నుండి  జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి. కలెక్టర్ కార్యాలయ  ముందు శాంతియుత ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.అనంతరం కలెక్టర్ సంగీత సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ లు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాలో గత కొన్ని ఏండ్లుగా అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదని చెప్పారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు 'డిమాండ్స్ డే'ను చేపట్టినట్టు వివరించారు.  జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని అన్నారు. డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్నదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, రాయితీని పూర్తిగా అమలుచేస్తూనే బస్సుపాసు సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు. పేదలైన జర్నలిస్టులను ఆదుకునేందుకు 'జర్నలిస్టు బంధు' ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా కాలంలో ఎత్తేసిన రైల్వే పాసులను పునరుద్ధరించాలనీ, రాయితీని వంద శాతానికి పెంచాలని కోరారు.ఈ సౌకర్యాన్ని కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ జిల్లా కలెక్టర్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ లేఖలు రాసి రైల్వే పాసులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జాతీయ నాయకులు రంగు రాజయ్య,జిల్లా అధ్యక్షుడు, పోగుల విజయకుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ ,జాతీయ కౌన్సిల్ సభ్యులు రంగు రాజయ్య,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల బిక్షపతి, ఉపాధ్యక్షులు బోయిని వినోద్,

మారం తిరుపతిరెడ్డి, వెలమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,

సహాయ కార్యదర్శులు ఎండి షాబీర్ పాషా,కల్లేపల్లి దేవేందర్, జిల్లా నాయకులు ఇరుకుల్ల వీరేశం,నల్లూరి లింగయ్య,పల్ల మహేష్,దాడి మురళి, దాసోహం గోపికృష్ణ, గంగారపు వెంకటేష్ మేడి దేవేందర్,ఎండి షబ్బీర్,బాలరాజ్, ఎండి మోకీద్,కే.భాస్కర్, ch సుమన్, మహేష్,పరమేష్,అఖిల్,దేవేందర్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: