మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గాం మండలం- పొట్యాల గ్రామం లో రాత్రి జరిగిన మీటింగ్ లో యువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రశ్నించే ప్రజా గొంతుక రాజ్ ఠాకూర్ నాయకత్వాన్ని బలపరుస్తూ

 జరిగిన మీటింగ్ మస్కం భాస్కర్,  సంధ్య అక్షయ్ ఆధ్వర్యంలో *150 మందికి పైగా యువకులు, మహిళలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్ * హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ *సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటదని,యువకులకు ఉద్యోగ అవకాశాలు ప్రతి కుటుంబం బంగారు కుటుంబం అవుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ముఖ్యమంత్రి  కుటుంబం మాత్రమే  బంగారు  కుటుంబం అయింది అని అన్నారు, తలాపునే *ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్న చుక్క  నీరు రైతులకుఅందుతలేదని, అంతర్గం, పాలకుర్తి మండలాల రైతులకు నీరు అందించాలని, గతంలో *పాదయాత్ర*5000 మంది రైతులతో చేయడం జరిగిందని చెప్పారు,యువకులు విద్యార్థులు TRS ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగుచెందారని,  నిరుద్యోగ భృతి,  లక్ష ఉద్యోగాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అని ,దళితులకు 3 ఎకరాల భూమి అని అబద్ధాల మోసపూరిత మాటలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఇపుడు కొత్తగా దళిత బందు పథకాన్ని, దగ్గరి బందు పథకం గా మారుస్తూ తమ పార్టీ వారికే కేటాయిస్తూ ప్రజలను మోసంచేస్తున్నారని , ధ్వజమెత్తారు.

 యువకులు, మహిళలు  మాట్లాడుతు *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వం లో పని చేయుటకు సిదంగా ఉన్మాము ఎటువంటి అడ్డంకులు ఎదురైనా రాబోయే రోజుల్లో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను MLA గెలిపించడం లో మేము భాగస్వాములవతమని చెప్పారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు పోచయ్య,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, EX:Mpp ఉరిమెట్ల రాజలింగం,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, బీసీసీల్ అధ్యక్షులు బరుపటి శ్రీనివాస్,అధికార ప్రతినిధి మడ్డీ తిరుపతి,Ex సర్పంచ్ గుంట బాపు,కొత్తపల్లి రాజ్,బోండ్ల అశోక్, తోకల శంకర్, తోకల దామోదర్,దొరిశెట్టి శ్యామ్,గంధం సాగర్, బరుపటి తిరుపతి, లగిశెట్టి రాకేష్,ఈదునూరి హరిప్రసాద్ అప్పాసి శ్రీనివాస్,బియ్యలా శశ్రీనివాస్, దారవేణి పొచం, దారవేణి సాయి,అబ్దుల్ మహారాజ్,దొరిశెట్టి శ్యామ్,బరిపాటి తిరుపతి,బయ్యాల శ్రీనివాస్,ఓల్లెపు సాయి కుమార్,మస్కం సుధాకర్, బోండ్ల ఉమేష్,ప్రవీణ్, గణేష్, మస్కం శ్రీను, వెంకటేష్,గణేష్,*మహిళలు మస్కం యశోద, మల్లేశరీ, బోండ్ల వజ్రం, వేవమ్మ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: