ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) ను పురస్కరించుకొని, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వరంగల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి సహకారంతో మల్లికాంబ మనోవికాస కేంద్రం, హనుమకొండ లోని మేధ్యో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, మాట్లాడుతూ "దివ్యాంగులను ప్రతి ఒక్కరూ ఆప్యాయతతో చేరదీయాలన్నారు. వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. న్యాయ సేవలు సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. తదుపరి అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ టి. మదన్ మోహన్ రావు మాట్లాడుతూ "పిల్లలకు ఈ రోజు అన్ని రకాల రక్త పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందించడం జరిగిందని తెలిపారు. మరియు భవిష్యత్తులో వీరికి కావలసిన అన్ని రకాల వైద్య సేవలకు మమ్మల్ని సంప్రదించవచ్చునని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డాక్టర్ సి.ఉమారాణి, డాక్టర్ మానస ఆమ్య, ప్రోగ్రాం ఆఫీసర్ వాణిశ్రీ, ఎస్. సమ్మారావు, డాక్టర్ తేజస్విని, డాక్టర్ అనూష, భగవాన్ రెడ్డి, మధురిమ, సంతోష్ కుమార్, మరియు ఆశ్రమ నిర్వాహకులు ప్రొఫెసర్ పద్మ, బండ సదానందం, కోడం కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు పిల్లలకి స్నాక్స్ అందించి, వారితో కలిసి కాసేపు ఆనందంగా గడిపారు.

Post A Comment: