మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖనికి శ్రామిక భవన్లో, సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా 3వ మహాసభలు డిసెంబర్ 10, 11 తేదీలలో ఎన్టిపిసి ప్రాంతంలో జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగిందని, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలోని సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వంగా సంస్థలైన ఎన్టిపిసి, సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం సాగిస్తుందని, జిల్లాలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులు, తదిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతన జీవోలు అమలు చేయాలని, ఎన్టిపిసి, ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి, కాంటాక్ట్ కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం ఐక్య పోరాటాలు నిర్వహిస్తూ పోరాడుతున్న సిఐటియు పెద్దపల్లి జిల్లా 3వ మహాసభలు జయప్రదం కోసం ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు, ఈ కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు , మెండె శ్రీనివాస్, కోశాధికారి, యం రామాచారి, నార్మెట్ల నరసయ్య, బూడిద గణేష్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు,

Post A Comment: