మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలంలోని గోదావరి నది తీరం వెంట పులి సంచరిస్తున్నదని గత పక్షం రోజుల నుండి ప్రచారం జరుగుతుంది దీనిని మొదటగా పెద్దంపేట గ్రామ సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ గురువయ్య ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారం అందించి నిజము కాదో గుర్తించినారు ఫారెస్ట్ ఆఫీసర్ చిరుతపులి పాదముద్రల నిర్ధారించి ప్రజలు గొడ్ల కాపరులు రైతులు రాత్రి వేళల్లో తిరగకూడదని ప్రజలకు తెలియజేసినారు ఈ వార్త తెలిసిన ప్రజలు వాహనదారులు బాటసారులు రాత్రి వేళల్లో భయం గుప్పెట్లో కాలం వెల్లదీస్తున్నారు అదే సందర్భంగా విలేజ్ రామగుండం పాములపాట గోదావరి తీర ప్రాంతంలో పులి తిరుగుతున్నదని మళ్లీ పుకార్లు వెళుతున్నాయి అసలు పులి ఉన్నదా ఇంతవరకు ఎవరు చూసింది మాత్రం లేదు పాదముద్రలను చూసి పులి తిరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది దీనిని వెంటనే నిర్ధారించి పులి ఉన్నదో లేదో ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రజలకు తెలియజేసి ప్రజలను భయాందోళనల నుండి విముక్తి చేయాలని ప్రజలందరూ కోరుతున్నారు

Post A Comment: