ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

ఈ  నెల  16న జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా  నిర్వహించడానికి  పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, చీఫ్ సూపర్డెంట్ లు, లైసన్, అసిస్టెంట్ లైజన్ అధికారులతో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రూప్1 ప్రిలిమ్స్ 

 అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https: www.tspsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు.అందులోని సూచనలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం1.00 గంటల వరకు ఉంటుందని అభ్యర్థులు 2 గంటల ముందే ( ఉదయం 8.30)వరకు పరీక్షా కేంద్రాలకు చేసుకోవాలన్నారు. గ్రూప్1లో తొలిసారిగా బయోమెట్రిక్ ఉంటుందని అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి అన్నారు. ఉదయం10.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లను మూసి వేస్తారని, పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తోపాటు ఒక ఐడిని ఒరిజినల్( ఆధార్ /పాన్ కార్డు/ ఓటర్ ఐడి/ ఎంప్లాయ్ ఐ డి/ డ్రైవింగ్ లైసెన్స్/ పాస్ పోర్ట్ ) తీసుకురావాలని అన్నారు. హాల్ టికెట్ పై ఫోటో/ సంతకం లేనిపక్షంలో వారు గెజిటెడ్ అధికారిచే సక్రమంగా ధృవీకరించిన మూడు పాస్ పోర్ట్ ఫోటోలు తీసుకురావాలని మరియు నిర్ణీత ప్రొఫార్మాలో పరీక్ష కేంద్రంలో అప్పగించాలన్నారు.అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించే ముందు పరీక్ష వేదిక ప్రవేశద్వారం వద్ద పరిశీలిస్తారని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు చెప్పుల మాత్రమే ధరించి రావాలని బూట్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కోసం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే అనుమతించబడుతుందని అన్నారు., అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, ఓఎంఆర్ జవాబు పత్రంలో బుక్లెట్ సంఖ్య, వేదిక కోడ్ సరిగ్గా వేయాలన్నారు. సిరీస్ ఏ, బి, సి మరియు డి నుండి ఆరు అంకెల సంఖ్యకు మార్చబడిందని అన్నారు.

ఓఎమ్ఆర్ జవాబు పత్రంపై వైటనర్ / చాక్ పవర్ / బ్లేడ్/ ఎరేజర్ ఉపయోగించరాదన్నారు. పరీక్ష పూర్తయ్యేవరకూ అభ్యర్థులెవరూ పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళకూడదని అన్నారు.  పరీక్షను సజావుగా ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్   రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. హనుమకొండ జిల్లాలో 21024మంది అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగ  ఇప్పటి వరకు 14,438 మంది  అభ్యర్థులు హల్ టికెట్ లను  డౌన్లోడ్ చేసుకున్నారు అని వివరించారు. అభ్యర్థుల కోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష ల  నిర్వహణ కు 49 మంది చీఫ్ సూపరిండెంట్లు,15 మంది లైసన్ ఆఫీసర్లు, 49 అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, నియమించడం జరిగిందని అన్నారు. అన్ని చీఫ్ సూపర్డెంట్స్ రూమ్స్ లలో సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేయడం  జరిగింది అన్నారు.  అభ్యర్థులు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1115 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాలు, చుట్టుపక్కల ఫోటోస్టాట్ కాపీయింగ్ జిరాక్స్ సెంటర్లను  మూసి వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు, చుట్టుప్రక్కల144 సెక్షన్  అమలు  చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, త్రాగునీరు  తదితర మౌళిక  వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో టిఎస్పిఎస్సి సెక్రటరీ అనిత రాంచంద్రన్, పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నుండి అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, డిఆర్ఓ  వాసు  చంద్ర, పిడి  డిఆర్డిఏ  శ్రీనివాస్ కుమార్ , లైసన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైసన్ అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: