ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఉమ్మడి వరంగల్ జిల్లా
కోటగుళ్లు గణపేశ్వరాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల తవ్వకాలు జరిపారు. మంగళవారం రాత్రి పసుపు కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. గుడి ఆవరణలో జరిపిన ఈ తవ్వకాల్లో భారీగా సొత్తు లభ్యమైనట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రచారం సాగుతోంది. చారిత్రక సంపద కోటగళ్లుకు రక్షణ లేకపోవడంపై చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ రక్షణ కోసం పోలీసులు గతంలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం అవి పని చేయడం లేదు. దీని అదనుగా చేసుకున్న దుండగులు తవ్వకాలకు పాల్పడ్డారు.తవ్వకాలలో గుప్త నిధులు లభ్యమయ్యాయా లేదా అనేది చర్చనీయాంశం అయింది.

Post A Comment: