ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, మాట్లాడుతూ
ప్రజావాణి ద్వారా ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు. సోమవారం ప్రజా వాణి కార్యక్రమంలో ( 90 ) దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ తెలిపారు. ఈ కార్యక్రమలో డిఆర్ఓ వాసు చంద్ర , డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, డిఐసి జిఎం హరి ప్రసాద్, జిల్లా వెద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబ శివ రావు, డిపిఓ జగదీశ్వర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మేన శ్రీను, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: