ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి సుంక శ్రీధర్
పెద్దపల్లిజిల్లా వ్యాప్తంగా ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇళ్ళు,ఇళ్ళస్థలాలు పొందేందుకు చాలాఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు.చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళులేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.కావున ప్రభుత్వంనుంచి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు, ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని కోరుతు,అదేవిధంగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజేఎఫ్) పెద్దపల్లి జిల్లాకమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకి వినతిపత్రం అందజేయడం జరిగింది.బస్టాండ్ వద్ద అమరవీరుల స్తూపంనుండి నూతన కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షుడు, పోగుల విజయకుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి సుంక మహేష్,జాతీయ కౌన్సిల్ సభ్యులు రంగు రాజయ్య,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడాకుల బిక్షపతి, ఉపాధ్యక్షులు బోయిని వినోద్, మారం తిరుపతిరెడ్డి,వెలమారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,సహాయ కార్యదర్శులు ఎండి షాబీర్ పాషా,కల్లేపల్లి దేవేందర్,జిల్లా నాయకులు ఇరుకుల్లా వీరేషం,నల్లూరి లింగయ్య,పల్ల మహేష్,దాడి మురళి,దాసోహం గోపికృష్ణ, సిహెచ్ ,మేడి దేవేందర్,ఎండి షబ్బీర్,బాలరాజ్,ఎండి మోకీద్, కే.భాస్కర్,సుమన్,మహేష్, పరమేష్,అఖిల్,దేవేందర్, తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: