ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
చారిత్రక భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాడ వీధుల నిర్మాణాలను వెంటనే చేపట్టడానికి తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందిచాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్యలతో కలిసి
భద్రకాళి మాడ వీధుల నిర్మాణం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం నకు అధ్యక్షత వహించిన చీఫ్ విప్ పలు సూచనలు చేసారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమ్మ వారి మాడ విధుల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 30కోట్ల రూపాయలు ను కేటాయించిన విషయం విదితమే అని అన్నారు.ఎస్‌డీఎఫ్ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కింద రూ. 20 కోట్లు, కూడా కింద 10 కోట్లు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారుకాకతీయుల కాలం నాటి భద్రకాళీ అలయం ఇరుకుగా మారడం ఉత్సవాల సమయంతో అమ్మవారి ఊరేగింపు చేయడం ఇబ్బందిగా ఉండడంతో దేవాలయం చుట్టూ మాడ వీధులు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.భద్రకాళీ ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మాణం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయని అన్నారు.
. మాడ వీధుల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం నిట్ ప్రొఫెసర్లు అందిస్తారని అని అన్నారు. రాజగోపురం, మాడ విధుల నిర్మాణం నకు సంబందించిన భుసార పరీక్షలు, ఎత్తు పరీక్షలు నిర్వహించాలి అని అన్నారు. రాజగోపురం నిర్మాణం ను ప్రఖ్యాత స్థాపతుల తో నిర్మించాలని అన్నారు.మాడ విధులు నిర్మాణం అమ్మ వారి పాదాల కింద ఉండే విధంగా నిర్మాణలు చేపట్టాలని అన్నారు. నిర్మాణాలు అన్నీ సాంకేతిక నైపున్యాలు తో పాటు శాస్త్ర ప్రకారమే ఉండాలి అని అన్నారు. నిర్మాణాలలో ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదు అని,వరద నీరు ఎక్కడ నిలవకుండా చూడాలి అని అన్నారు. మాడ వీధుల నిర్మాణాలుకు అవసరం అయిన సలహాలు, సూచనలు తీసుకోవాలి అని, నిర్మాణాలు అన్నీ కలకాలం మనుగడ సాగించే విధంగా ఉండాలి అని అన్నారు. వచ్చే దసరా నాటికీ భక్తులకు మాడ వీధులు భక్తులకు అందుబాటులో తేవాలని, ప్రతి వారం మాడ వీధుల నిర్మాణం పై సమీక్ష సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత చారిత్రక దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేస్తున్నారు అని అన్నారు. భద్రకాళీ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవా లు పెద్ద ఎత్తున జరుపుతారని ఇక ఈ సేవలు మాడవీధుల్లో జరుగుతాయి అని అన్నారు.భద్రకాళి ఆలయం పక్కన గల బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు వల్ల ఎకో టూరిజం పెరిగిందని అన్నారు.సుమారు రూ 50 కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ లో భాగంగా నగరంలో అనేక చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయని రెండు వేల సంవత్సరాల క్రితం వెలసిన జైన మతానికి చెందిన అగ్గలయ్య గుట్ట వంటి అనేక ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు.నగరం లో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధ సహజమైన అందాలను అనుసంధానం చేయడం ద్వారా టూరిజాన్ని ప్రోత్సహించవచ్చునని తెలిపారు. వరంగల్ నగరం హెల్త్, ఎడ్యుకేషన్, కల్చరల్ హబ్ గా తీర్చిదిద్దబడుతున్న ప్రస్తుత తరుణంలో టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి అన్నీ రకాలుగా సహకారం అందించడం జరుగుతుందని, రాబోయే కాలంలో టెంపుల్ టూరిజం హబ్ అనే కనెక్టివిటీ తో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, భద్రకాళీ ఆలయ ప్రధాన అర్చకులు భద్ర కాళీ శేషగిరి రావు, సీపిఓ సత్యనారాయణ రెడ్డి, ఈఓ శేషు భారతీ, సహాయ కమిషనర్ సునీత, ఎండోమెంట్, డిఈ రమేశ్ బాబు, ఎన్ఐటీ ప్రోఫెసార్లు కామేశ్వర్ రావు, రమణ మూర్తి, సుపర్డంట్ అద్దంకి విజయ్ కుమార్, కుడా ఈ ఈ భీం రావ్, ఆర్ అండ్ బి ఈఈ రాజం, మాడవీధుల డిజైనర్ ధృమాతరు కంపెనీ కన్సల్టెంట్ రాజ్ కుమార్, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: