ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు ఎస్పీ  పరామర్శ చేశారు. 

విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని  ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో నీ అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి, అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు  నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పి  మాట్లాడుతూ.

పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజావసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పి  తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 

అక్టోబర్ 21,1959 సంవత్సరం లో సీఆర్పీఎఫ్  ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ మన వారి పై దాడి చేసి 10 మందిని హతమార్చడంతో, అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తుందన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంను గత సంవత్సరం నుండి పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నాం అని అన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుందనీ పేర్కొన్నారు. సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి పోలీస్  వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో , సేవాతత్పరత తో పని చేస్తుందన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణార్థం పోలీస్ ఫ్లాగ్ డే ను ఘనంగా నిర్వహిస్తోందన్నారు.

అమర వీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈసంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారనీ అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ

వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు.

ఈ కార్యక్రమానికి అమరులైన కుటుంబాలకు సంబందించిన కుటుంబ సభ్యులు హాజరై నివాళ్ళు అర్పించడం జరిగింది. ఎస్పి  త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాధ్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు బహుమతులు  అందించారు. అంతకు ముందు, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు అమరవీరుల  కుటుంబాలతో ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో డిఎస్పీ లు ఏ. రాములు, రామ్ మోహన్ రెడ్డి, కిషోర్ కుమార్, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: