చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్ 



ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ధర్మం వైపు నిలబడ్డ కోమటిరెడ్డి

రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు అభినందిస్తున్నారు," ఆశీర్వదిస్తున్నారు, గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారని

కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని 11వ వార్డులో భాజాపా మున్సిపల్ ఫ్లోర్

లీడర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న

సంక్షేమ పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందనివ్వకుండా అహంకార భావంతో కుటుంబ పరిపాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అనేక రకాల సందర్భంలో ముఖ్యంగా అసెంబ్లీలో మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసం పదేపదే వేడుకున్నా ప్రతిపక్షంలో ఉన్న

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై నిరంతరం కేసీఆర్ వివక్ష చూపారని అన్నారు. మునుగోడు ప్రజలు కెసిఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని అనుకుంటున్నారని అన్నారు. మోటార్లకు మీటర్లు వస్తాయన్న కెసిఆర్ మాటలు ఎంతవరకు వాస్తవం కావని, హుజురాబాద్ లో ఉపఎన్నిక సందర్భంగా ఈటెల రాజేందర్ ఆ ప్రాంతంలో మోటార్లకు మీటర్లు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ

ప్రజలకు ఎక్కడ ఇస్తే భాజాపా వైపు తెలంగాణ ప్రజలు స్వార్థంతో మక్కువ చూపుతారేమొనన్న స్వార్థంతో పథకాలను ప్రజలకు అందనీయకుండా చేస్తున్న కేసీఆర్ ని మునుగోడు ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్తారన్నారు. మునుగోడులో బిజెపి జైత్రయాత్రను తట్టుకోలేకపోతున్న టిఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి

రాజగోపాల్ రెడ్డి విజయాన్ని ఆపలేరు అన్నారు. కెసిఆర్ నియంతృత్వ పాలనకు ముగింపు మునుగోడు నుండే ప్రజలు నాంది పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ భాజపా మున్సిపల్ అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, అధిక సంఖ్యలో భాగస్వాములు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: