హనుమకొండ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ప్రిలిమ్స్ ముగిసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు .అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా చక్కగా సహకరించారని అన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూసిన అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలలో మొత్తం 21025మంది అభ్యర్థులకు గాను16605 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు.4420మంది ఆబ్సెంట్ అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.16న హనుమకొండ జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈ సందర్బంగా అర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, నిట్, చైతన్య డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను సందర్శించారు. హాజరు వివరాలను తెలుసుకొన్నారు. పరీక్షా కేంద్రాలలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, పరీక్ష అనంతరం పరీక్షా పత్రాలను పంపేవరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యకమంలో డిఆర్ఓ వాసు చంద్ర,తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: