ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి పేర్కొన్నారు. ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా చక్కగా సహకరించారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించిన అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Post A Comment: