కాలేశ్వరం, అక్టోబర్ 11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌ను మద్దులపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సురేష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత ఆధ్వర్యంలో ఎస్సై సురేష్‌ను శాలువాతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా మద్దులపల్లి గ్రామానికి సంబంధించిన పరిస్థితులు, గ్రామ ప్రజల సమస్యలు, స్థానిక పరిస్థితుల గురించి నాయకులు ఎస్సై దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గ్రామ పరిస్థితులను తెలుసుకొని, త్వరలోనే మద్దులపల్లి గ్రామాన్ని సందర్శిస్తానని ఎస్సై సురేష్ తెలిపినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ తరఫున సహకారం అందించాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి గ్రామ సర్పంచ్ వేల్పుల సరిత, ఉపసర్పంచ్ లచ్చిరెడ్డి, వార్డు సభ్యుడు వెంకటేష్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, కాంగ్రెస్ నాయకులు రాకేష్, బానయ్య, శ్యాంసుందర్, పన్నాల సమ్మయ్య, రవీందర్, ఏలా సమ్మయ్య, శేఖర్, మహేష్, సల్పాల రవి, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: