కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ, గంగారం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లను డీఈ/ఆపరేషన్ నాగరాజు తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్లలో విద్యుత్ లోడ్, వోల్టేజ్ పరిస్థితులను పరిశీలించారు. వల్లంకుంట, తాడిచర్ల 33 కేవీ ఫీడర్లతో పాటు 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల లోడ్ పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ స్తంభాలపై విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీలో కాటారం సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, లైన్‌మ్యాన్ ప్రవీణ్, అన్‌మ్యాన్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: