మహాముత్తారం, జూలై 20: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ అట్టెం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఈ పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి, ఉప సర్పంచ్ తలారి అఖిల్, రత్నం సడవలి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రామోజీ, వార్డు సభ్యులు రత్నం లక్ష్మీస్వామి, అంతర్గం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.





Post A Comment: