కాటారం, జూన్ 17: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) అమలుపై కాటారం, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం జూన్ 18న ఉదయం 11 గంటలకు కాటారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, మాస్టర్ ట్రైనర్లు హాజరై ఓటరు జాబితాల సవరణ విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి బాధ్యతలపై అవగాహన కల్పించనున్నారు. శిక్షణలో 87 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), 10 మంది బీఎల్వో పర్యవేక్షకులు పాల్గొననున్నారు. ఇందులో కాటారం మండలం నుంచి 36 మంది బీఎల్వోలు, 4 మంది పర్యవేక్షకులు, మహాముత్తారం మండలం నుంచి 27 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు, మల్హర్‌రావు మండలం నుంచి 24 మంది బీఎల్వోలు, 3 మంది పర్యవేక్షకులు హాజరు కానున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావడానికి మీడియా ప్రతినిధులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తహసీల్దార్ కోరారు.

Post A Comment: