భూపాలపల్లి టౌన్, జనవరి 27: తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివెళ్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర జరుగుతున్న సమయంలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. జాతరలో పాల్గొనే ప్రజలు, అభ్యర్థులు, ప్రపోజర్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో మేడారం వెళ్లే పరిస్థితి ఉన్నందున నామినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సక్రమంగా సాగాలంటే, ఈ పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయడం అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందని రవి పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: