August 2025
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

జయశంకర్ భూపాలపల్లి జిల్లా 29 ఆగస్టు, 2025 శుక్రవారం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అనే యువతి, తన తండ్రి ఇటీవల మరణించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ ఆవేదనను తట్టుకోలేకపోయిన ఆమె, ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామం పరిసరాల్లో, బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి వారు నిరాశతో ఈ నెల 6న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, కాటారం శివారులోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఒక యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం పక్కన కుంకుమ, నిమ్మకాయలు, ఆధార్ కార్డు వంటి వస్తువులు కూడా ఉండటంతో, ఆ యువతిని వర్షిణిగానే పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.




Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 

ఉమ్మడి వరంగల్ 29 ఆగస్టు, 2025 శుక్రవారం

ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏకకాలం హన్మకొండ ఖమ్మం లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.హన్మకొండ లోని ప్రశాంత్ నగర్ లో ఉన్న ఆయన ఇంటి లో శుక్రవారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేపట్టారు.అదేవిధంగా ఆయన స్వంత జిల్లా ఖమ్మం జిల్లా లోని తహసీల్దార్ ఇంట్లో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.బండి నాగేశ్వరరావు గతంలో హసన్ పర్తి, ధర్మ సాగర్, ఖాజీపేట లో తహసీల్దార్ గా విధులు నిర్వహించారు.ఆ సమయం లో ఆయన అవినీతి కి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వీధులు, వాడలు, కాలనీలన్నిటా గణపతి మండపాలు వెలిశాయి. భక్తులు తమ ఇళ్లలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఏడాది గణపతి నవరాత్రులు పదో రోజున అంటే సెప్టెంబర్ 7న నిమజ్జనం చేయాలని పండితులు, జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఏడాది గణపతి నవరాత్రుల సమయంలో సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ కారణంగా గ్రహణం ప్రారంభమయ్యే సమయానికంటే ముందే గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులకు సూచనలు జారీ చేస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు, శుభకార్యాలు, దేవతా విగ్రహాల దర్శనం వంటివి నిషిద్ధం కాబట్టి, గ్రహణ కాలానికి ముందే గణపతి నిమజ్జనం చేస్తే శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా గణపతి నవరాత్రుల తర్వాత కొందరు భక్తులు ఐదు, ఏడు, పది రోజుల పాటు తమ ఇళ్లలో గణపతిని ఉంచుకుని నిమజ్జనం చేస్తారు. అయితే, ఈసారి చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరిగా పదో రోజున నిమజ్జనం పూర్తి చేయాలని సలహా ఇస్తున్నారు.

దీంతో, భక్తులు సెప్టెంబర్ 7న నిమజ్జనం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్టితో మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నారు. నిమజ్జనం కోసం చెరువులు, కుంటలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. చంద్రగ్రహణం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటానికి, పవిత్రమైన గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేందుకు పండితుల సూచనలను పాటించాలని అధికారులు, ఉత్సవ నిర్వాహకులు కోరుతున్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని జయశంకర్ భూపాలపల్లి

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు క్రైమ్ మీటింగ్ జరిగింది. జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.

ఎస్పీ పెండింగ్‌లో ఉన్న క్రైమ్ కేసులు, విచారణలో ఉన్న కేసుల పురోగతిని ఒక్కొక్కటిగా సమీక్షించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి కోర్టులకు పంపాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 

ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. మహిళల భద్రత, పిల్లల రక్షణ, అక్రమ రవాణా, మద్యనిషేధం ఉల్లంఘన, సైబర్ నేరాలు, గూండా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరాలు జరగకుండా ముందుగానే నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదనంగా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా బలోపేతం చేయడం, ఇంటెలిజెన్స్ సేకరణ పెంచడం, కొత్తగా వెలుగులోకి వస్తున్న నేర ధోరణులను క్షుణ్ణంగా గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో భక్తిశ్రద్ధలతో గణపయ్యను తమ ఇళ్లలో, మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు.

వరంగల్ ఎల్లంబజార్లో 45 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డాల్ఫిన్ గల్లీలో సుతిల్ తాళ్ల (జూట్ రోప్స్) తో తయారు చేసిన ప్రత్యేకమైన గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ, ఉత్సవ నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విగ్రహాలను మండపాలకు తరలించి వేడుకలను కొనసాగించారు. ప్రజలు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా గణపతి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ ఇళ్లలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా గణపతి వేడుకల సందడి కొనసాగుతోంది. ప్రజలు తమ ప్రాంతంలో ప్రతిష్ఠించిన గణపయ్య విగ్రహాల చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తూ వాటి విశేషాలను పంచుకుంటున్నారు. ఈ గణపతి ఉత్సవాలు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో భక్తి, ఐక్యతను చాటుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం లోని ఆగాపుర లో తెలంగాణ రైసింగ్ పేరుతో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విగ్రహం, ఆ విగ్రహాన్ని వినాయకుడిగా చేసి రేవంత్ రెడ్డిని దేవుడిగా...., పూజలు చేయడం... కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహమా లేక అధికారులను మెప్పించాలని అర్భకత్వమో కానీ పవిత్రమైన గణేష్ చతుర్థి రోజు ఇలా ఒక వ్యక్తి విగ్రహాన్ని గణేశుడుగా మలిచి పెట్టడం పూజించడం పద్ధతి కాదు. ఇటువంటి అత్యుత్సాహాన్ని చూపించే వ్యవహారాలు హిందూ సమాజం సహించదు. ఇటువంటి ప్రచారపు కక్కుర్తి కారణంగా పూర్వపు ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయంలో తన విగ్రహాన్ని చెక్కించుకోవడం ప్రజల యొక్క ఆగ్రహానికి గురై రాజకీయ పదవులకు దూరమైన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. గతంలో ఖమ్మంలో శ్రీకృష్ణుని విగ్రహం పేరుతో మాజీ. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం తయారు చేయడం దానిని వ్యతిరేకించిన భక్తులు కోర్టుకుపోవడం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇంకా సమసి పోలేదు. ఇటువంటి పైత్యపు వ్యవహారాన్ని ఏ ఒక్క గణపతి భక్తుడు ఏ ఒక్క హిందువు కూడా సహించడు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనుయాయుల యొక్క నిర్వాకాన్ని సరి చేయవలసిందిగా కోరుతున్నాము.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

జయశంకర్  భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో, జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే,   మహిళా పోలీసు సిబ్బందికి వాహనాలను అందజేశారు.

మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించిన *‘వుమెన్ బ్లూ కోల్ట్*’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ఎస్పీ  జెండా ఊపి స్కూటీ ర్యాలీకి ప్రారంభ సూచన చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్, కాటారం పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ నుంచి ఎంపికైన మహిళా సిబ్బందికి స్కూటీలు కేటాయించారు.

ఈ సందర్భంలో అడిషనల్ ఎస్పీ  నరేష్ కుమార్ , భూపాలపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ  సంపత్ రావు , కాటారం సబ్-డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ రావు , సిఐలు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను  జిల్లా కలెక్టర్ స్నేహ శిరీష్ సోమవారం సందర్శించారు.

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. 

సోమవారం హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వస్తున్న ఓపి, ఐపీ సేవలు, డెలివరీ కేసుల గురించిన వివరాలను వైద్యాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్ ను పరిశీలించి ఎంతమంది వైద్యులు సిబ్బంది, షిఫ్టుల వారిగా విధులు నిర్వర్తిస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ కేసులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తారని, డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు డిశ్చార్జ్ చేస్తారని, సెక్షన్ ఆపరేషన్లు, హై రిస్క్ కేసుల ట్రీట్మెంట్ గురించి కలెక్టర్ ఆరా తీశారు. అదేవిధంగా ఎక్స్ రే యూనిట్ ను  పరిశీలించారు.  పలు వార్డులను సందర్శించి  ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను గురించి బాలింతలు, గర్భిణీలతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలకు వైద్యులు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. హై రిస్క్ కేసులకు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారం తీసుకునే విధంగా, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించేలా  వైద్యులు సలహాలు సూచనలు చేయాలన్నారు. 

ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్వో  డాక్టర్ మదన్ మోహన్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, ఇతర వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

సెప్టెంబర్ 1, 2004 తర్వాత అమలు పరుస్తున్న ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన    కాంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు అమలు పరచాలని  సెప్టెంబర్ 1 న  హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద PRTUTS ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా పోస్టర్ ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం కేంద్రంలో  జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా సుభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని, కాంట్రిబ్యూట్ లేని విధంగా , 30 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఉద్యోగికి ,ఉద్యోగ విరమణ అనంతరం ఎలాంటి అస్సూరెన్స్ లేకుండా ఉన్నటువంటి, షేర్ మార్కెట్ పెట్టుబడుల పై ఆధారపడిన ,స్థిరమైన పెన్షన్ లేని లోపభూయిష్టమైన ఈ అసంబద్ధమైన పెన్షన్ విధానాన్ని ,

రద్దు చేయాలనీ అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో CPS  రద్దు చేస్తామని చెప్పిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే CPS ను  రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు పరచాలని ,పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదని,అది ఉద్యోగి హక్క అని 1982 లోనే సుప్రీం కొర్టు పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని తెల్పిందని తెలిపారు.


ఈ పెన్షన్ విద్రోహ దినం Sep 1 PRTUTS చేపట్టే మహాధర్నా  లో ప్రతి CPS ఉపాధ్యాయుడు తమ బాధ్యతగా కచ్చితంగా పాల్గొని  ,మహాధర్నా ను విజయవంతం చేసి ప్రభుత్వానికి మన పోరాట స్ఫూర్తిని తెలియచేయాలని  తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTUTS కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు A. రవీందర్, A. తిరుపతి , సంఘ సీనియర్ నాయకులు N. సురేష్ రావు, T. సంపత్ మరియు ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


న్యూఢిల్లీ: NDA కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవికి సి.పి. రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. రాధాకృష్ణన్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు: “రాధాకృష్ణన్‌ గారు పార్లమెంటు సభ్యుడిగా, తమిళనాడు గవర్నర్‌గా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. ఎల్లప్పుడూ అంకితభావంతో ప్రజల కోసం కృషి చేశారు. రాజ్యాంగంపై ఆయనకు ఉన్న పట్టు దేశానికి ఒక ఆస్తి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, NDA తరఫున రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల తాను ఆనందంగా ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “రాధాకృష్ణన్‌ గారు విశాల అనుభవం కలిగిన నేత. ఆయన ఎంపికతో దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ గౌరవనీయమైన బాధ్యతలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. రాధాకృష్ణన్‌ రాజకీయ జీవితం విశేషంగా సాగింది. రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన, తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కీలకపాత్ర పోషించారు. అనంతరం జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా కూడా వ్యవహరించి పరిపాలనా అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. NDA తరఫున రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

సంగారెడ్డి పట్టణంలో ద మాస్టర్ మైండ్ పాఠశాలలో 79 వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల చైర్మన్ దార సింగ్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాలలో విద్యార్థులతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు మరియు డ్రాయింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు 

పాఠశాల చైర్మన్ దారాసింగ్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహానీయులు పోరాటాలు మరెన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వతంత్ర ఫలాలు చివరి గడపకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది అని అన్నారు మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తితో అన్ని రంగాల్లో సబండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యచరణ మరింత చిత్తశుద్ధితో అమలుచేసి ఫలితాలు సాధించడం ద్వారా మాత్రమే స్వతంత్ర పోరాట త్యాగదనులకు మనం అర్పించే ఘన నివాళి అని తెలియజేశారు

భారత స్వతంత్రం దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీకున జరుపుకుంటా ఈరోజు మన దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన రోజు 1947లో ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మన దేశం బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందినది అని తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వంటి గొప్ప నాయకులు మన స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మనకు స్వచ్ఛ ను ఇచ్చారు మనం ఈరోజు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాంధవి. ఉపాధ్యాయులు విజయరాణి.సానియా. జ్యోతి. అక్షయ. పూజ. స్వప్న. ప్రవనిత. సుమతి. శోభారాణి. సరస్వతి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఘనపురం మండల కేంద్రంలో పోలీస్‌ సర్కిల్‌ నూతన కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి ఎస్పి కిరణ్ ఖరే  గురువారం  ప్రారంభించారు. గతంలో చిట్యాల సర్కిల్‌ లో ఘనపురం, రేగొండ  ఉండేది. నూతంగా కొత్తపల్లి గోరి  పోలీసు స్టేషన్ ఏర్పాటుతో  ఘనపురం, రేగొండ, కొత్తపల్లి గోరిని నూతన పోలీసు సర్కిల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ  మేరకు సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌గా సిహెచ్ .కరుణాకర్ రావును జిల్లా ఎస్పీ  నియమించారు. దీంతో ఘనపురం పోలీస్ స్టేషన్  పై అంతస్తులో నూతన సర్కిల్‌  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ  పూజలు చేసి, కార్యాలయాన్ని ప్రారంభించి, సిఐ కరుణాకర్ రావును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే ,ఎస్పీ మాట్లాడుతూ  ఘనపురం  జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తతకూడదని, పరిపాలన సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతన సర్కిల్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్ భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్,  , ఎస్సై అశోక్, గణపురం ఎమ్మార్వో, ఎంపీడీవో ఘనపురం మండల రాజకీయ నాయకులు, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. 

 గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలోనీ వ్యాపార సముదాయాలు మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వివిధ వ్యాపార సంస్థలు, జెన్కో సహకారంతో ఏర్పాటు చేసిన 160 సీసీ కెమెరాలను ఎస్పీ కిరణ్ ఖరే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, జెన్కో, జిల్లా కేంద్రంలోని వివిధ వ్యాపార వాణిజ్య, మరియు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 


నేరాలను తక్షణమే పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో గతంలో ఉన్న సీసిటీవీ కెమెరాస్ కన్నా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేశామని, రేగొండ నుంచి కాళేశ్వరం వరకు నిఘా నేత్రం ద్వారా నిఘా ఉంటుందని పేర్కొన్నారు. 

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలనీ ఎస్పీ కోరారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ

 నేరాల అదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మిస్టరీ కేసులను చేధించటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పట్టణంలోనే కాదు గ్రామాల్లో సైతం నేరాల కట్టడికి సీసీ కెమేరాలు వినియోగించాలన్నారు. జిల్లా కేంద్రంలో దొంగతనాలు జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడానికి సిసి కెమెరాలు చాలా ముఖ్యమని, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు అరికట్టడం తొందరగా జరుగుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ శాఖకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. నాయకులు వ్యాపారవేత్తలు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేష్ కుమార్, సింగరేణి జిఎం రాజేశ్వరావు, పట్టణ ఛాంబర్ అఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంచంద్రరావు, డాక్టర్.కిరణ్, డిఎస్పీ సంపత్ రావు, సిఐనరేష్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ లష్కర్ సింగారంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో  ఈ రోజు ఎంతమందిని పరీక్షించారు, EHMIS ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసిన వివరాలను కలెక్టర్ వైద్యాధికారి డాక్టర్ హైదర్ ను  అడిగి తెలుసుకున్నారు.  అలాగే ఈ- ఔషదీ పోర్టల్ లో నమోదు చేసిన మందుల వివరాలను , సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి అందుకున్న మందుల వివరాలను, ఇష్యూ చేసిన వివరాలను అలాగే స్టోర్ లో నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. టీబీ  ముక్త్ అభియాన్ లో ఎంత మందిని పరీక్షించారు , ఏ ఏ హై రిస్క్ గ్రూపుల వారిని పరీక్షించారు, వారి వివరాల నమోదు,phc లో నమోదు చేసిన  గర్భిణీ ల వివరాలు,NCD లో బిపీ,షుగర్ నిర్ధారణ, మందుల పంపిణీ , ఫాలో అప్ వివరాలను పరిశీలించారు.టీబీ  హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని వైద్యాధికారి, వైద్యులకు సూచించారు.


నమోదైనటువంటి గర్భిణీ స్త్రీలకు ఏ సేవలు అందిస్తున్నారు ,అలాగే ప్రసవానంతర సేవలను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫీవర్ సర్వే నిర్వహించాలని,డ్రై డే కార్యక్రమం పట్ల ప్రజలకు భాగస్వాములను చేస్తూ అవగాహన కలిగించాలన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హైదర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలను అందించాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. 

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, వివిధ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. హనుమకొండ జిల్లాకు డెడికేటెడ్ కలెక్టర్ గా స్నేహ శబరీష్ ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కు సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా తనను నియమించిందని పేర్కొన్నారు. బుధవారం రోజున హనుమకొండ జిల్లా పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని తెలిపారు. అదేవిధంగా సిద్దాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్లు చెప్పారు. గ్రామాలు, వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలన్నారు. డెంగ్యూ కేసుల పట్ల ఇక్కడి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు  తీసుకుంటున్న చర్యలలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 

కలెక్టర్ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, తదితర వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడినట్లయితే  అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించాలన్నారు. గ్రామాలలో సీజనల్  వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. 

హెచ్ఐవి నియంత్రణలో భాగంగా అనుమానిత లక్షణాలతో ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించి వారి జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా కృషి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి పేషెంట్లకు  వైద్య సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను నిర్వహించాలని  పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో డ్రై డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలు, ఏఎన్ఎంలతో గ్రామాలలో ఫీవర్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

సమీక్షా సమావేశంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ డెంగ్యూ కేసులు ఉన్నచోట్లా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైరల్, ఫివర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు 

జనవరి నుండి ఇప్పటి వరకు  మలేరియా పొజిటీవ్ ఒక కేసు, డెంగ్యూ పాజిటివ్ కేసులు 48 వరకూ నమోదయ్యాయని తెలియజేశారు.  గత సంవత్సరం 182 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డీపీవో లక్ష్మీ రమాకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఉన్న తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించినట్లు తెలిపారు. మురుగు నీరు నిలవకుండా  చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా ఆయిల్ బాల్స్ వేస్తున్నామని, దోమల లార్వా పెరగకుండా  చర్యలు తీసుకుంటున్నట్లు  పేర్కొన్నారు.  పారిశుద్ధ్య నిర్వహణ బాగుండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహన్, వివిధ ఆసుపత్రుల  వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా లో 

వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారి నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్  సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వల పై సీఎస్ కే. రామ కృష్ణా రావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ   2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. 

వరద పరిస్థితుల పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని,  ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలని అన్నారు. 

సిఎస్ కే.రామ కృష్ణా రావు మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం  తూర్పు, దక్షిణ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేసిందని అన్నారు.  మిగిలిన ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని అన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో కలెక్టర్ వద్ద ఉన్న డిజాస్టర్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు.  వరద అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

ఉదృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్ట , వంతెనలను మూసి వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కొన్ని కాలనీ లలో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.  ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు.

రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, కె నారాయణ, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

రానున్న రోజుల్లో భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ    వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్  7981975495 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ  కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని 

రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యల పై   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు  శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు  హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాన్ కంట్రోల్ సెంటర్ నుంచి  అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,  హైదరాబాద్ ప్రాంతంలో అధికంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంచార్జి మంత్రి వర్యులు రెవెన్యూ, పోలీసు, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  నగరంలో వర్షాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలని అన్నారు. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్. ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని, ఆకస్మిక వరదల సమయంలో ప్రజల ప్రాణాల రక్షణకు ఏర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం ఖమ్మంలో మనకు ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.


వరద సహాయక చర్యలకు కలెక్టర్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అక్కడ వారికి అవసరమైన వైద్యం ఆహారం ఇతర ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఖమ్మం ,రామగుండం, కరీంనగర్,  వరంగల్ వంటి కార్పొరేషన్ ప్రాంతాలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి 24×7  మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. కార్పొరేషన్ ప్రాంతాలలో ముందుగానే అవసరమైన బృందాలను సిద్ధంగా పెట్టుకోవాలని అన్నారు. 

వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్, ఇతర పరికరాలు ఫీల్డ్ లో సిద్ధం పెట్టుకోవాలని, విద్యుత్ సిబ్బంది సెలవులు రద్దు చేయాలని,  మొబైల్ ట్రాన్స్ ఫార్మర్ లు సన్నద్ధం చేయాలని, ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు.  

వరదల గురించి ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో, ఎఫ్.ఎం రేడియో , వివిధ మాధ్యమాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలని అన్నారు.  ఐటీ సంస్థలతో  మాట్లాడి వీలైనంత వరకు  వర్క్ ఫ్రం హోం జారీ చేసేలా చూడాలని, రోడ్డు పైకి ప్రజలు అనవసరంగా రావద్దని అన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని విద్యా సంస్థలతో చర్చించి సంబంధిత శాఖ అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని  సీఎం తెలిపారు. 

హైడ్రా, జిహెచ్ఎంసి ,మెట్రో వాటర్ సర్వీస్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అన్నారు.   ఫ్లై ఓవర్ పై నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పంప్ ల ద్వారా నీటిని డ్రైనేజి కు తరలించాలని సీఎం అన్నారు. 

గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు మరణించే పశువులకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోవడం వల్ల సహాయం చేయలేకపోతున్నామని,  పోలీసు అధికారులకు సమాచారం అందించి వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అన్నారు. వరదల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అన్నారు.

ఉదృతంగా ప్రవహించే వాగులు, నీటి వనరుల సమాచారం తెలుసుకొని, వాటికి సమీపంలో ఉన్న రోడ్లు వంతెనల పై రాకపోకలను నిలిపివేయాలని, దీని కోసం స్థానిక పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని  అన్నారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు. భారీ వరదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల క్రింద సాధ్యమైన మేర  విద్యుత్ ఉత్పత్తి చేయాలని అన్నారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నింపుకోవాలని, వస్తున్న వరదను అంచనా వేస్తూ అవసరమైన మేర నీరు దిగువకు విడుదల చేయాలని అన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, గ్రామాలలో భారీ వర్షాల వల్ల చెరువులు తెగి పోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఎరువుల సరఫరా చేయక పోయినప్పటికీ  బఫర్ స్టాక్ తో రైతులకు సర్దుబాటు చేశామని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియాను రైతులకు సరిపడా సకాలంలో సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. యూరియా అక్రమ రవాణా జరక్కుండా జిల్లాలలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలని అన్నారు. 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మూసి నది ఉధృతంగా పాడుతూనే నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వరదలు అనే పద్యంలో కనెక్టివిటీ దెబ్బ తినకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో వరదల నియంత్రణ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అన్నారు. భారీ వర్షాలు వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. 

ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ,   భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే మూడు రోజులలో 24 జిల్లాల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.  భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ శాఖ,  నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ వైద్య ఆరోగ్య  శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు. 

రాష్ట్రంలో ఒకేసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు వరదలు వచ్చే అవకాశం ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ వరద రానున్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని అన్నారు.  

సమావేశానంతరం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 7981975495 ఏర్పాటు చేసి పోలీస్ రెవెన్యూ ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు 24/7 అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ అధికారులు,ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలనీ పేర్కొన్నారు.

 వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి డిఆర్ఓ వైవి గణేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా హాస్టల్ లో మెరుగైన వసతులు ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా హాస్టల్ లో విద్యార్థినుల సంఖ్య ను, అక్కడ ఉన్న వసతులు, మధ్యాహ్న, భోజనం మెనూ చార్ట్, కూరగాయలు, తదితర నిత్యావసరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. వాటిని గురించిన వివరాలను అదనపు కలెక్టర్ ప్రిన్సిపల్ జ్యోత్స్న ను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని, నిబంధనల మేరకు మెనూ పాటించాలన్నారు. పాఠశాల మొత్తం పరిశుభ్రతను పాటించాలన్నారు. బాలికల హాస్టల్ కాబట్టి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.

 ఈ కార్యక్రమంలో స్థానిక హాస్టల్ ఉపాధ్యాయినిలు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 

ప్రజావాణి కార్యక్రమంలో  వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 175 అర్జీలను అందజేశారు. 


ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వై. వి.గణేష్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కే నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లా లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. 

సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలో నిర్మాణంలో ఉన్న పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి సిద్ధార్థ నాయక్, అధికారులతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి పరిశీలించారు. లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని, ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుకు రూ. 5 లక్షల ను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కాబట్టి లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులన త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లుల చెల్లింపునకు జరిగిన పనులకు పేమెంట్ చెల్లించే విధంగా ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత నిర్మాణ దశ ఫోటోలను అప్డేట్ చేయాలన్నారు. అదేవిధంగా హనుమకొండ నగరంలోని 31వ డివిజన్ న్యూ శాయంపేటలో పలువురు లబ్ధిదారులకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ ఎండి వీపీ గౌతమ్ సూచించారు. 

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక లేఖ ద్వారా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. తన రాజీనామాకు గల కారణాలను ఆయన స్పష్టంగా వివరించలేదు. భవిష్యత్ రాజకీయాలపై కూడా ఆయన ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు.

బాలరాజు బీజేపీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బాలరాజు, ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఆయన అనుచరులు, అభిమానులు కూడా కొంతకాలంగా ఆయనతో కలిసి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

బాలరాజు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు బలపడుతున్న నేపథ్యంలో, ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


మేడిగడ్డ టీవీ న్యూస్ - నాగ్పూర్‌     

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి, గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ కాల్ రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో మంత్రి నివాసంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సుదీర్ఘ గాలింపు తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఒక తప్పుడు బెదిరింపు అని నిర్ధారించారు.

పోలీసులు ఈ బెదిరింపు కాల్ వచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. ఆ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసి, ఈ బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాలతో పాటు ప్రజలలోనూ కొంత ఆందోళన కలిగించింది. అయితే, సరైన సమయంలో పోలీసులు స్పందించడం, నిందితుడిని పట్టుకోవడం వల్ల పరిస్థితి సద్దుమణిగింది.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లాలో నూతన పరిశ్రమలకు కావాల్సిన  అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్  లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యూనిట్లకు వచ్చిన దరఖాస్తులు, పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అనుమతులు, ఆయా శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న వాటి  వివరాలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. టీ ప్రైడ్ పథకం కింద ఆరు యూనిట్లకు సబ్సిడీ మంజూరైందని జిఎం తెలియజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలకు కావాల్సిన చట్టపరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని  అధికారులకు కలెక్టర్ సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం గురించి వివిధ కులవృత్తుదారులకు, యువతకు అవగాహన కల్పించి పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్  ఎక్స్చేంజ్ గురించి నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అధికారులు సమన్వయంతో అనుమతులు మంజూరు చేయాలన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ వైవి గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్  మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డిటిడిఓ ప్రేమకళ, టీజిఐఐసీ మేనేజర్ మహేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, 

జిడబ్ల్యూఎంసి డిప్యూటీ కమిషనర్  రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, కుడా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.