ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి లోని జయశంకర్ భూపాలపల్లి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ రోజు క్రైమ్ మీటింగ్ జరిగింది. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు.
ఎస్పీ పెండింగ్‌లో ఉన్న క్రైమ్ కేసులు, విచారణలో ఉన్న కేసుల పురోగతిని ఒక్కొక్కటిగా సమీక్షించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి కోర్టులకు పంపాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. మహిళల భద్రత, పిల్లల రక్షణ, అక్రమ రవాణా, మద్యనిషేధం ఉల్లంఘన, సైబర్ నేరాలు, గూండా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నేరాలు జరగకుండా ముందుగానే నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదనంగా, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా బలోపేతం చేయడం, ఇంటెలిజెన్స్ సేకరణ పెంచడం, కొత్తగా వెలుగులోకి వస్తున్న నేర ధోరణులను క్షుణ్ణంగా గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: