జయశంకర్ భూపాలపల్లి జిల్లా 29 ఆగస్టు, 2025 శుక్రవారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అనే యువతి, తన తండ్రి ఇటీవల మరణించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ ఆవేదనను తట్టుకోలేకపోయిన ఆమె, ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గ్రామం పరిసరాల్లో, బంధువుల వద్ద, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి వారు నిరాశతో ఈ నెల 6న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, కాటారం శివారులోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఒక యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహం పక్కన కుంకుమ, నిమ్మకాయలు, ఆధార్ కార్డు వంటి వస్తువులు కూడా ఉండటంతో, ఆ యువతిని వర్షిణిగానే పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: