ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ జిల్లా హాస్టల్ లో మెరుగైన వసతులు ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేటలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్ లో విద్యార్థినుల సంఖ్య ను, అక్కడ ఉన్న వసతులు, మధ్యాహ్న, భోజనం మెనూ చార్ట్, కూరగాయలు, తదితర నిత్యావసరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. వాటిని గురించిన వివరాలను అదనపు కలెక్టర్ ప్రిన్సిపల్ జ్యోత్స్న ను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని, నిబంధనల మేరకు మెనూ పాటించాలన్నారు. పాఠశాల మొత్తం పరిశుభ్రతను పాటించాలన్నారు. బాలికల హాస్టల్ కాబట్టి భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక హాస్టల్ ఉపాధ్యాయినిలు, తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: