ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ జిల్లాలో నూతన పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యూనిట్లకు వచ్చిన దరఖాస్తులు, పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అనుమతులు, ఆయా శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న వాటి వివరాలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. టీ ప్రైడ్ పథకం కింద ఆరు యూనిట్లకు సబ్సిడీ మంజూరైందని జిఎం తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమలకు కావాల్సిన చట్టపరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం గురించి వివిధ కులవృత్తుదారులకు, యువతకు అవగాహన కల్పించి పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ గురించి నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలు పొందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అధికారులు సమన్వయంతో అనుమతులు మంజూరు చేయాలన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపన పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వైవి గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డిటిడిఓ ప్రేమకళ, టీజిఐఐసీ మేనేజర్ మహేష్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య,
జిడబ్ల్యూఎంసి డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, కుడా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: