హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం లోని ఆగాపుర లో తెలంగాణ రైసింగ్ పేరుతో రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విగ్రహం, ఆ విగ్రహాన్ని వినాయకుడిగా చేసి రేవంత్ రెడ్డిని దేవుడిగా...., పూజలు చేయడం... కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహమా లేక అధికారులను మెప్పించాలని అర్భకత్వమో కానీ పవిత్రమైన గణేష్ చతుర్థి రోజు ఇలా ఒక వ్యక్తి విగ్రహాన్ని గణేశుడుగా మలిచి పెట్టడం పూజించడం పద్ధతి కాదు. ఇటువంటి అత్యుత్సాహాన్ని చూపించే వ్యవహారాలు హిందూ సమాజం సహించదు. ఇటువంటి ప్రచారపు కక్కుర్తి కారణంగా పూర్వపు ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయంలో తన విగ్రహాన్ని చెక్కించుకోవడం ప్రజల యొక్క ఆగ్రహానికి గురై రాజకీయ పదవులకు దూరమైన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. గతంలో ఖమ్మంలో శ్రీకృష్ణుని విగ్రహం పేరుతో మాజీ. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం తయారు చేయడం దానిని వ్యతిరేకించిన భక్తులు కోర్టుకుపోవడం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఇంకా సమసి పోలేదు. ఇటువంటి పైత్యపు వ్యవహారాన్ని ఏ ఒక్క గణపతి భక్తుడు ఏ ఒక్క హిందువు కూడా సహించడు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనుయాయుల యొక్క నిర్వాకాన్ని సరి చేయవలసిందిగా కోరుతున్నాము.
Post A Comment: