ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా లో 

వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారి నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్  సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వల పై సీఎస్ కే. రామ కృష్ణా రావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ   2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. 

వరద పరిస్థితుల పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని,  ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలని అన్నారు. 

సిఎస్ కే.రామ కృష్ణా రావు మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం  తూర్పు, దక్షిణ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేసిందని అన్నారు.  మిగిలిన ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని అన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో కలెక్టర్ వద్ద ఉన్న డిజాస్టర్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు.  వరద అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

ఉదృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్ట , వంతెనలను మూసి వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కొన్ని కాలనీ లలో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.  ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు.

రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, కె నారాయణ, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: