BREAKING NEWS
సంగారెడ్డి జిల్లా బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని హరిత రిసార్ట్ లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.నిన్న సాయంత్రం హరిత రిసార్ట్ లో రూమ్ అద్దెకు తీసుకున్న తర్వాత రాత్రి ఏ సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియరాలేదు, ఈ ఇద్దరు ప్రేమికుల రూమ్ కి ఉదయం రూమ్ క్లినింగ్ సిబ్బంది వెళ్ళగా ఫ్యాన్ కి ఉరివేసుకుని విగత జీవులుగా ఉన్నారు.ఈ విషయాన్ని రిసార్ట్ యాజమాన్యం పోలీసులకు సమాచారంఅందించింది. మునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న వారు ప్రేమికులు ఉదయ్(26), మౌనిక (19)గా గుర్తించారు.వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం తో ఇలా రిసార్ట్ లో ఆత్మహత్య చేసుకొన్నారని స్థానిక పోలీసులు తెలిపారు. ఇద్దరు ప్రేమికుల మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయల అలుముకున్నాయి.
Post A Comment: