జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో వేలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు,నిధులు, నియామకాలు వస్తాయని ఆశించిన స్థాయిలో అది జరగలేదు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల అనే నలుగురు కుటుంబ సభ్యుల చేతిలో పెట్టడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ వస్తే నాలుగు కోట్ల ప్రజల జీవితాలు మారుతాయి అని అనుకున్నారు కానీ నలుగురు కుటుంబ సభ్యులు బాగుపడ్డారు. ఇలా అనేక సమస్యల పైన అభివృద్ధికి నోచుకోని తెలంగాణ ఎలాగైనా సరే మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో స్వయంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల వాసి అయిన రాజ్ గిరే సంతోష్ రెడ్డి కెసిఆర్ పైన కామారెడ్డి నియోజకవర్గంలో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని ఒక హోటల్లో వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం చేయడం జరిగింది. వారితోపాటు న్యాయ విద్యార్థులు సాయి కర్ణ, నాగరాజ్, సాయి యువకులు పాల్గొన్నారు.


Post A Comment: