పెద్దపల్లి:నవంబర్:4:23(మేడిగడ్డటీవీ న్యూస్ ఛానల్):మంథని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు,ఆయన తమ్ముడు శ్రీనుబాబు తమను ప్రలోభాలకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి, భర్త రాచకొండ రవిలు శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమానాయక్ కు ఫిర్యాదు చేశారు,అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ పార్టీకి చెందిన కమాన్ పూర్ మండల పరిషత్ అధ్యక్షురాలినైన నన్ను కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు మద్దతుగా పార్టీలో చేరితే భారీగా నగదు ఇస్తామని శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు,ఆయన పీఏగా చెప్పుకుంటున్న ప్రసాద్ రెడ్డిలు తమకు లంచం ఇస్తామని ఫోన్ కాల్ ద్వారా ప్రలోభ పెడుతూ తీవ్రంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని పేర్కొన్నారు.మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ కింద వారిపై చర్యలు చేపట్టి ఎన్నికలు సజావుగా సాగేందుకు వారిపై అవినీతి వ్యతిరేక చట్టం,ఆర్పీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.




Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: