ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

హనుమకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వివరాలను  పకడ్బందీగా నిబంధన మేరకు నమోదు చేయాలని  ఎన్నికల పరిశీలకులు  అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో  లో   ఎన్నికల వ్యయ పరిశీలకులు. రాహుల్ పంజాబ్రావ్ గవాండే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ .తో కలిసి  హనుమకొండ లో గల రెండు నియోజకవర్గాల ఎన్నికల వ్యయ వివరాల నమోదు పై  సంబంధిత  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ పరకాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటుచేసిన బృందాలు వాటి పనితీరు తదితర అంశాలను  జిల్లా ఎన్నికల అధికారి సిక్త పట్నాయక్ వివరించారు.ఎన్నికల కు సంబంధించిన అన్ని రకాల టీమ్ లతో క్రమం తప్పకుండ సమావేశం నిర్వహిస్తున్నమని, ఇప్పటికే శిక్షణ ను సిబ్బంది కి ఇచ్చినట్లు తెలిపారు.ఈ సందర్బంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వేడ్ బృందాలు స్టాటిక్ సర్వేలన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు పకడ్బందిగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో నగదు బంగారం,  వస్తువుల పంపిణీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫిర్యాదులు సమాచారం తీసుకుంటూ పకడ్బందీగా విధులు నిర్వహించాలని అన్నారు.సహాయ వ్యయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సహాయ వ్యయ పరిశీలన అధికారులు రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.అనుమానాస్పద బ్యాంక్ లావా దేవీ లు,10 లక్షల కంటే మించి నగదు జమ, ఉపసంహరణ, ఆన్లైన్ ద్వారా మల్టిపుల్ లావా దేవీ లపై పర్యవేక్షణ చేయాలని అన్నారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ చూడాలి అని సూచించారు.ప్రజలను ఎటువంటి ప్రలోభావాలకు గురికాకుండా పాటిష్ట చర్యలు చేపట్టాలి అని అన్నారు.ఐన్ కం టాక్స్, వాణిజ్య పన్నుల శాఖ, వ్యయ పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదు లో సమన్వయము తో పని చేయాలని అన్నారు. ఎం సి ఎం సి కమిటీ ద్వారా రోజువారి దిన పత్రికల్లో , లోకల్ ఛానెల్ లో వచ్చే పేడ్ న్యూస్ పై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా పై పటిష్టంగా ఉంచాలన్నారు.రాజకీయ పార్టీ లు సమావేశాలు నిర్వహించే సమయంలో వాటిని నిశితంగా రికార్డ్ చేయాలని, అక్కడ వినియోగించే ప్రతి వస్తు రేట్ చార్ట్ ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖాతాలో నమోదు జరిగే విధంగా నిబంధనలో మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రికార్డ్ అంత పారదర్శకంగా ఉండాలి అని అన్నారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, డిసిఓ నాగేశ్వరావు, డీసీపీ అబ్దుల్ బారి ఐ టి అధికారులు, వి.ఎస్.టి., ఎస్.ఎస్.టి.,  ఎం.సి.సి., ఎం.సి.ఎం.సి ,  టీమ్ ల అధికారులు, సిబ్బంది,పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: